Homebreaking updates newsహిరానీ, నీల్.. ఆ విషయంలో ఇద్దరూ తోపులే

హిరానీ, నీల్.. ఆ విషయంలో ఇద్దరూ తోపులే

భారత్ సమాచార్ , సినీ టాక్స్ : ప్రస్తుతం దేశమంతా డంకీ, సలార్ చిత్రాల మేనియా నడుస్తోంది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల గురించే సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. సలార్ మాస్ హీరోయిక్ మూవీ కావడంతో కాస్త కలెక్షన్లు అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే బహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడంతో సినిమాకు హైప్ బాగా వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. అలాగే డంకీ కూడా బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్, ఓటమెరుగని రాజ్ కుమార్ హిరానీ కాంబోలో రావడంతో విపరీతమైన బజ్ ఏర్పడింది. అయితే రెండు సినిమాలు సక్సెస్ అయినప్పటికీ హిరానీ, నీల్ లో ఎవరూ గొప్ప దర్శకుడు అనే చర్చకు నెటిజన్లు తెరలేపారు. మరి వీరిద్దరి ట్రాక్ రికార్డును మనం కూడా ఓసారి లుక్కేద్దాం..

హిరానీ తీస్తే హిట్టే..
మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్ , పీకే, త్రి ఇడియట్స్, సంజు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు హిరానీ సొంతం. సామాజిక సమస్యలు, సందేశం, దేశభక్తి, ఎమోషనల్ డ్రామా..తో పాటు కామెడీ టచ్ ఇవ్వడం హిరానీ స్పెషల్. ఈయన తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసినా హయ్యెస్ట్ కలెక్షన్ చేస్తూ ఉంటాయి. మొత్తానికి టీవీలకు అతుక్కుపోయిన ఆడియన్స్ ను సైతం థియేటర్లకు రప్పించగలిగే దర్శకుడు ఈయన.

సినీ ప్రవేశం: 2003
మొత్తం సినిమాలు: 5
హయ్యెస్ట్ గ్రాసర్: పీకే(769.89కోట్లు)
పెద్ద హిట్: త్రి ఇడియట్స్
సక్సెస్ రేట్: 100శాతం

పుల్లీ మాస్.. నీల్
ప్రశాంత్ నీల్ కు ఉగ్రం తొలి సినిమా. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ 1, ఆతర్వాత కేజీఎఫ్ 2. మూడు సినిమాలే చేశాడు. దక్షిణాది నుంచి రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లోకి వెళ్లిన దర్శకుడు నీల్. మిడ్ రేంజ్ హీరోగా ఉన్న యష్ ను పెట్టి కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టేశాడు. ఈయన మేకింగ్ అంతా వేరే స్టైల్ లో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ టోన్ తో ఈయన సినిమాలు అలరిస్తుంటాయి. ఈయన సినిమా చూస్తే వేరే ప్రపంచానికి వెళ్లామా అనే ఫీల్ కలుగుతుంది. హీరోలను ఎలివేట్ చేయడంలో దిట్ట.

సినీ ప్రవేశం: 2014
మొత్తం సినిమాలు: 3
హయ్యెస్ట్ గ్రాసర్: కేజీఎఫ్-2(రూ.1215కోట్లు)
పెద్ద హిట్: కేజీఎఫ్-2
సక్సెస్ రేట్: 100శాతం

ఇద్దరికీ ఇప్పటివరకూ ఫెయిల్యుూర్స్ లేవు. ఇద్దరూ చేసింది తక్కువ సినిమాలే. అయినా ఇండియన్ సినీ ఫ్యాన్స్ గుర్తుంచుకునే సినిమాలను తీశారు. ఇద్దరి పంథా వేరైనా తమ సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అని చూస్తే మాత్రం.. ఇద్దరూ దిగ్గజ దర్శకులే. ఎవరి సినిమాలు జనాలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారో వారే గొప్ప దర్శకులుగా నిలిచిపోతారు.

మరికొన్ని కథనాలు…

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments