Homebreaking updates newsమూలుగ బొక్క కోసం పెళ్లి క్యాన్సిల్

మూలుగ బొక్క కోసం పెళ్లి క్యాన్సిల్

భారత్ సమాచార్, కరీంనగర్ : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన ‘బలగం’ అందరికీ గుర్తుండే ఉంటుంది. మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాల నేపథ్యంలో కమెడియన్ వేణు తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు సమాజాన్ని విపరీతంగా కదిలించింది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వెళ్లి మరి ఈ సినిమాను జనాలు చూశారు. అలాగే గ్రామాల్లో ప్రత్యేక తెరలు వేసి మరి ప్రదర్శించారు.

ఈ సినిమాలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను బాగా చూపించారు. ఈ మూవీలో ప్రధానంగా ఓ వృద్ధుడు చనిపోతే.. అతడి కొడుకులు, కుమార్తెలు, మనవడు, మనవరాళ్లు స్పందించే విధానాన్ని చక్కగా చూపించారు. పెద్ద కొడుకు, అల్లుడి మధ్య ఓ సందర్భంగా మూలగు బొక్క కోసం గొడవ వస్తుంది. అదే పెద్దగా అయ్యి ఆ రెండు కుటుంబాలు విడిపోతాయి. తర్వాత రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వృద్ధుడు చనిపోగా.. అతడి పిట్టను కాకులు ముట్టదు.. ఇలాంటి సన్నివేశాలతో కథనాన్ని వేణు అద్యంతం రక్తికట్టేలా నడిపించాడు. ఈ మధ్యలో వారిలో మళ్లీ అనుబంధాలు చిగురించేలా కొన్ని సన్నివేశాలను చక్కగా చూపించాడు. చివరకు అందరూ కలిసిపోవడం.. పెద్దాయన పిట్టను కాకిముట్టడంతో అందరూ సంతోషిస్తారు. రెండు కుటుంబాలు కలిసిపోతాయి. ఇలా కథ సుఖాంతం అవుతుంది. తెలంగాణ సమాజంలో మూలుగు(నల్లి) బొక్కకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ సినిమా ద్వారా చూపించాడు. ఇప్పుడు మూలుగు బొక్క కోసం ఓ పెళ్లి ఆగిపోయింది..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అచ్చం బలగం సినిమా రిపీటైంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. అయితే నవంబర్ మొదటి వారంలో నిశ్చితార్థంలో అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే అబ్బాయి తరుపు బంధువులు మూలుగు బొక్క కావాలని అడిగారు. వారు వేయకపోవడంతో గొడవ మొదలైంది. ఈ గొడవ ముదిరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. చివరకు పెళ్లి రద్దు అయ్యింది.

మరికొన్ని కథనాలు…

రంజాన్ వేళ.. కత్తులతో దాడి కలకలం

RELATED ARTICLES

Most Popular

Recent Comments