భారత్ సమాచార్, సినీ టాక్స్ : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టుకుంటూ దుమ్మురేపుతోంది. సలార్ వీరవిహారం.. 21న రిలీజైన షారుఖ్ ‘డంకీ’ పై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఐదేండ్ల క్రితం ఇదే టైంలో వచ్చిన షారుక్ మూవీని కేజీఎఫ్ తో ఢీకొట్టించి ఆయనకు తీవ్ర నష్టం తెప్పించాడు. ఇప్పుడు సలార్ దెబ్బకు ‘డంకీ’కి దమ్కీ ఇచ్చేలా కనపడుతోంది.
దేశంలో ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడక ప్రభాస్ కు, ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. బహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ లు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయనే చెప్పాలి. ఇప్పుడు సలార్ తో వారికి ఫుల్ మీల్స్ దొరికినట్టైంది. అందుకే ఫుల్ జోష్ లో ఉన్నారు. సలార్ కు ప్రభాస్ కటౌట్ తో పాటు, కేజీఎఫ్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అద్బుతమైన కాస్టింగ్ తో సినిమా బాగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ఆడియన్స్ కూడా థియేటర్లకు చేరుకున్నారు. దీంతో సలార్ క్రేజ్ ఆకాశాన్నంటుతోంది. అభిమానుల అంచనాలకు మించి సలార్ ఉండడంతో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
డంకీ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నేపథ్యం మాములుది కాదు. ఆయన సినిమాల్లో సందేశం, ఎమోషన్స్, దేశభక్తి.. వీటికి కాస్త కామెడీ టచ్ ఉంటుంది. ఆయన చిత్రాలు అన్ని హిట్టే. ఓటమి ఎరుగని దర్శకుడు ఆయన. ఆయన తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసిన అవి భారీ బడ్జెట్ ను రాబడుతాయి అనే టాక్ ఉంది. ఇక షారుఖ్.. ఈ ఏడాది జవాన్, పఠాన్ రెండూ రూ.1000కోట్ల క్లబ్ లో చేరడంతో డంకీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కాకపోతే సలార్ ధాటికి డంకీపై ఫుల్ ఎఫెక్ట్ పడుతోంది.