భారత్ సమాచార్, సినీ టాక్స్ : సూర్య-జ్యోతిక అందమైన జంట. సౌత్ సినీ సెలబ్రిటీల్లో వీరి జంటకు ప్రత్యేక స్థానముంది. తమ నటనతో వీళ్లు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జ్యోతిక కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే సూర్యను 2006లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లయిన తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించింది. దానికి సూర్య ఏనాడూ వద్దని చెప్పలేదు. జ్యోతిక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ అడపాదడపా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక సూర్య ఫుల్ బిజీ యాక్టర్. మొన్నటిదాక వీరిది అన్యోన్య దాంపత్యం అనుకున్నారు అంతా..
సడెన్ గా జ్యోతిక ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయినట్టు వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఆమె అత్తిల్లు వదిలేసి ముంబైకి తల్లిదండ్రుల దగ్గరకు ఎందుకు వెళ్లింది..? అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె పిల్లలను కూడా అక్కడి స్కూల్ చేర్పించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు విషయాలు నిజాలే అని తెలుస్తోంది. మరి సూర్య-జ్యోతిక విడాకులు తీసుకున్నారు కావొచ్చు అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యింది అని కొందరంటున్నారు. మరి వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. జ్యోతిక మాత్రం తమ బంధంపై వచ్చే వార్తలన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది.
తానూ ముంబై నుంచి తన తల్లిదండ్రుల నుంచి 27సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నానని, వారి వృద్ధాప్యంలో వారికి తోడుగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని చెపుతోంది. అయితే మరీ సూర్య ఒంటరిగా ఉంటాడు కదా.. మీ పేరెంట్స్ నే చెన్నైకి తీసుకొచ్చి అంతా కలిసే ఉండొచ్చు కదా అనే ప్రశ్నకు జ్యోతిక.. తన అత్తింట్లో తన పేరెంట్స్ ఎలా ఉండగలరని సమాధానం చెప్తోంది. ఇలాంటి రూమర్స్ కు ఆన్సర్ ఇవ్వకుండా సూర్య సైలంట్ గా ఉన్నాడు.. చూడాలి మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో.. సినీ సెలబ్రిటీలపై వచ్చిన వార్తలు మొదట్లో రూమర్స్ గానే బయటకు వచ్చినా.. కొన్ని రోజుల తర్వాత అవే నిజమవుతాయి. మరి జ్యోతిక-సూర్య ఇష్యూలో అలాంటిది జరగవద్దని వారి అభిమానులు, సినీజనాలు కోరుకుంటున్నారు.