Homebreaking updates newsనయా ‘శివగామి’.. లేడి విలన్ శ్రియారెడ్డి!

నయా ‘శివగామి’.. లేడి విలన్ శ్రియారెడ్డి!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ కు ఎంత పేరు తెచ్చిందో.. అనూహ్యంగా ఓ నటికి హీరోయిన్ కు మించిన పేరొచ్చింది. వెండితెరపై మరో ‘శివగామి’లా ఆకట్టుకున్న ఈ నడివయస్సు భామ ఎవరబ్బా..అని ఆమె అంటే తెలియని నేటి జనరేషన్ అనుకోవచ్చు. కానీ పాత సినీ జనాలకు ఈవిడ సుపరిచితమే.

ఆమె పేరు శ్రియారెడ్డి.. ఆమెది 21ఏండ్ల సినీ ప్రయాణం.. కానీ చేసింది 14 సినిమాలే. 2005లో ఓసినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించింది. అప్పుడామెను అందరూ మరో విజయశాంతి అన్నారు..ఇప్పుడు సలార్ లో లేడీ విలన్ పాత్రలో మరో ‘శివగామి’గా ప్రశంసలు అందుకుంటోంది.

శ్రియారెడ్డి వయస్సు 41 సం.రాలు. భరత్ రెడ్డి అనే ఓ ఇండియన్ క్రికెటర్.. చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. ఆయన బిడ్డే శ్రియారెడ్డి. మొదట ఈమెకు మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. తర్వాత సదరన్ స్పైస్ మ్యూజిక్ కు వీడియో జాకీగా మారింది. మెల్లిమెల్లిగా ఆడిషన్స్ ఇస్తూ 2002లో ‘సమురాయ్’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలేవీ రాలేదు. చాన్నాళ్లకు మలయాళంలో ఏకంగా మమ్ముట్టితో చేసింది. ఆ తర్వాత ‘అమ్మచెప్పింది’ అనే మూవీలో నటించింది. ఇలా ఏదో సినిమాలు చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా ఉండగా విశాల్ సోదరుడు దర్శకుడు విక్రమ్ కృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అన్నాదమ్ముళ్ల కాంబోలో వచ్చిన ‘పొగరు’లో ఆమెకు అవకాశం ఇచ్చారు. విక్రమ్ కృష్ణతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి దాక వెళ్లింది కథ. అనంతరం ఆమె సినీ జీవితానికి బ్రేక్ పడింది.

పదేళ్ల తర్వాత వడివేలు దర్శకుడిగా ఓ సినిమా తీస్తూ ఆమెను నటించడానికి ఒప్పించాడు. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో సీరీస్ ఒకటి చేస్తూ ప్రశాంత్ నీల్ కండ్లలో పడింది. ఇంకెంటి..ఆమెకు సలార్ లో వరదరాజు సోదరి రాధారమ పాత్రకు ఎంపిక చేశాడు. ఆ పాత్రలో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. జనాలు కూడా ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు. లేటెస్ట్ శివగామిగా కీర్తిస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

రన్ టైం ఎంత ఉందన్నది కాదు..విషయం ఉండాలంతే

RELATED ARTICLES

Most Popular

Recent Comments