Homeజాతీయంతప్పిపోయిన పిల్ల ఏనుగు.. తల్లిదగ్గరకు.. వీడియో వైరల్

తప్పిపోయిన పిల్ల ఏనుగు.. తల్లిదగ్గరకు.. వీడియో వైరల్

భారత్ సమాచార్, జాతీయం : మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా తమ పిల్లలు కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన అంతా ఇంతా ఉండదు. మళ్లీ తన పిల్లలు కనిపించేంత వరకు తల్లి మనస్సు విలవిలలాడుతూనే ఉంటుంది. ఇలాగే ఓ ఏనుగు తన బిడ్డ ఏనుగు కనిపించకుండా పోతే ఎంతగా విలవిలలాడిందో, తర్వాత తన బిడ్డ కనిపించగానే ఎంతగా సంబురపడిందో.. తెలియజేసే ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వాయర్ లో ఏనుగులు కూడా భారీ సంఖ్యలోనే ఉంటాయి. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఏనుగులు అందులోనే ఆహారాన్ని సంపాదించుకుంటూ అక్కడే నివసిస్తుంటాయి. రీసెంట్ గా ఓ పిల్ల ఏనుగు తప్పిపోయి ఆ అడవి నుంచి బయటకు వచ్చింది. దీంతో దాని తల్లి అడవి మొత్తం తిరగడం ప్రారంభించింది. తన బిడ్డ ఆచూకీ కోసం తాపత్రయపడింది. నీరు ముట్టకుండా, తిండి తినకుండా కంటనీరుతో అడవి మొత్తం ఆర్తనాదాలు చేయసాగింది. ఇది అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రూప్ కెమెరాలలో రికార్డు కావడంతో వారికి తెలిసింది. దీంతో అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ తల్లి ఏనుగు జాడను పసిగట్టడం ప్రారంభించారు. ఇలా రెండు మూడు రోజుల తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. ఈలోగా వారి సంరక్షణలో ఉన్న పిల్ల ఏనుగును అత్యంత జాగ్రత్తగా తల్లి వద్దకు చేర్చారు.

తన బిడ్డను చూసిన తల్లి ఏనుగు ఆనందంతో పరవశించిపోయింది. దగ్గరకు తీసుకుని తొండంతో ప్రేమగా నిమురుతూ సంబురంగా తోకను ఊపుతూ చాలా సేపు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పిల్ల ఏనుగును తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్లింది. పిల్ల ఏనుగు సంతోషంగా తల్లిని అనుసరించింది.

అటవీశాఖ చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియోలను సుప్రియ సాహూ అనే ఐఏఎస్ అధికారి తన ఎక్స్ అకౌంట్ పోస్టు చేశారు. పిల్ల ఏనుగును తల్లి దగ్గరకు చేర్చేందుకు తమ సిబ్బంది రామసుబ్రహ్మణ్యన్, భార్గవ తేజ, మణికంఠన్ అనే అధికారుల ఆధ్వర్యంలో జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments