Homebreaking updates news‘నా సామిరంగ’.. ఆషిక అదిరిందిరా

‘నా సామిరంగ’.. ఆషిక అదిరిందిరా

భారత్ సమచార్, సినీ టాక్స్ : సంక్రాంతి పండుగ పందెంకోళ్లు వచ్చేస్తున్నాయి. అవే నాటు కోళ్లు కాదండి బాబూ.. సినిమా పుంజులు. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ.. ఇక అంతా సందడే సందడి. నాలుగు సినిమాల మూవీ మేకర్స్ ప్రమోషన్లు పెంచేశారు. ఇక అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ అంటూ ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ అద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఊరమాస్ లుక్ లో నాగ్ సందడి చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ కావడం పక్కా అని ట్రైలర్ చూస్తూ తెలుస్తోంది.

ఇది విలేజ్ పొలిటికల్ డ్రామా, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ , ఫ్రెండి షిప్ నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున పాత్ర పేరు కిష్టయ్య. ఆ ఊరిలో కిష్టయ్యకు ఎవరైనా ఎదురెళ్లితే సుర్రుసుమ్మయిపోవుడు ఖాయం. ఇక కిష్టయ్య కత్తిపడితే ఊచకోతే.. అన్నట్టుగా ట్రైలర్ ఉంది. కిష్టయ్యకు స్నేహితులుగా అంజి(అల్లరి నరేశ్), భాస్కర్( రాజ్ తరుణ్) కీలకపాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు మిత్రలు చుట్టే కథ నడువనుందని తెలుస్తోంది. పల్లెలూరి పెద్దల మధ్య కక్షలు, గొడవలు…అలాగే ప్రభల సంప్రదాయాలు.. ఇలా సంక్రాంతికి కరెక్ట్ గా సూటయ్యే మూవీతో నాగార్జున ఆడియన్స్ ముందుకొస్తున్నాడనే చెప్పాలి.

ఇక హీరోయిన్ ఆషికా రంగనాధ్ అందం అందరినీ అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇందులో వరాలు ఆలియాస్ వరలక్ష్మీ అనే పాత్రలో కనిపించనుంది. కథలో ఈమె పాత్ర కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రెబల్ గా ఉంటూ భిన్న కోణాల్లో కనిపిస్తుందట. తన పాత్రను చూసి అమ్మాయంటే ఇలా ఉండాలని అందరూ అనుకుంటారట. నాగార్జునతో పనిచేయడం తనకు అద్భుతంగా అనిపించిందని ఆషియా సంబరపడిపోతోంది. ఇక సంక్రాంతికి వస్తున్న ఈ మూవీని జనాలు ఆదరించాలని కోరుతోంది.

మరికొన్ని సినీ విశేషాలు…

తెలుగు హీరో గదిలోకి రమ్మని వేధించాడు…విచిత్ర

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments