భారత్ సమాచార్, అంతర్జాతీయం : భారత దేశం మ్యాప్ ను గమనిస్తే కన్నీటి బిందువులాగా.. నుదుటపెట్టిన బొట్టులాగా శ్రీలంక కనిపిస్తుంది. మన దేశం మ్యాప్ లో కూడా ఆ దేశాన్ని చూపెట్టడం ఎందుకనేగా మీ ప్రశ్న మీకు కూడా రావచ్చు. సాధారణంగా ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఆయా దేశాల మ్యాప్ లు రూపొందిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇలాగే తమ దేశపు భూగోళాన్ని మ్యాప్ లో పొందుపరుస్తున్నారు. కానీ ఒక్క భారతదేశం మాత్రమే తమ భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంకను కూడా మ్యూప్ లో చూపిస్తోంది.
ఇలా ఒక దేశాన్ని మరో దేశం మ్యాప్ లో మనం ఎప్పుడూ చూడం. మన దేశ సరిహద్దు దేశాలైన పాక్, చైనా, బంగ్లాదేశ్ దేశాలు భారత్ మ్యాప్ లో కనిపించవు. కేవలం ఒక్క శ్రీలంక మాత్రమే కనిపిస్తుంది. అయితే దీనికి ఓ కారణముంది. అదెంటో తెలుసుకుందాం రండీ…
ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) 1958లో ఓ చట్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ‘లా ఆఫ్ ది సీ’ పేరుతో ఒక అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించారు. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాలను తప్పనిసరిగా యూఎన్ఓ లో సభ్యత్వం ఉండే ప్రతి దేశం కూడా పాటించాలి. ఏదైనా ఒక దేశం సముద్రతీరంలో లేదా ఆదేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధం కలిగి ఉంటే.. ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్ లో కచ్చితంగా చూపించాలి.
రెండు దేశాల మధ్య కనీసంగా 200 నాటికల్ మైల్స్ (సముద్రంలో కొలిచే కిలో మీటర్లు) అంటే.. 370 కి.మీ. లోపు ఉన్న దేశాన్ని కచ్చితంగా తమ దేశ మ్యాప్ లో కూడా చూపించాలి. ఈ చట్టాన్ని ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం కూడా పాటించాలి. అలా చూసుకుంటే శ్రీలంక.. భారత్ నుంచి కేవలం 18 నాటికల్ మైల్స్ అంటే కేవలం 54.8 కి.మీ దూరం మాత్రమే ఉంది. అందుకే మన మ్యాప్ లో కచ్చితంగా శ్రీలంక కూడా ఉంటుంది.