భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉందో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ , రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధర్మతేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, నిహారిక..ఇక వీరితో అల్లు ఫ్యామిలీని కూడా కలుపుకుంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్..ఇలా వీరి ఫ్యామిలీ మొత్తం కలిపి డజన్ నటులుంటారు. వీరందరిలో మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లు టాలీవుడ్ నే కాదు పాన్ ఇండియాను ఏలుతున్నారు. వీరి కుటుంబం నుంచే వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. వీరు సినిమాలతోనే కుటుంబ పరంగా కూడా వీరి ఐక్యత అభిమానులతో పాటు సగటు జనాలకు ముచ్చటేస్తుంది. ఇక ఇంటి పెద్ద కోడలు ఉపాసన వీరిందరినీ సమన్వయం చేసుకుంటూ కోడలంటే ఇలా ఉండాలని ప్రశంసలు పొందుతున్నారు.
ఇక మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ప్రతీ పండుగను బాగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈక్రమంలో ఈ సంక్రాంతిని కూడా ఘనంగా చేసుకోవడానికి బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పండుగ సంబరాల్లో భాగంగా ఇంటి డెకరేషన్, పిండి వంటలు, విందు భోజనం, మెహందీ, యోగా టైమ్ కు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశారు మెగా పెద్ద కోడలు ఉపాసన.
తమ కుటుంబంలోకి ఇటీవలె కొత్త కోడలిగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠి గురించి ప్రస్తావిస్తూ.. ‘కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది.. ఆమె చాలా స్వీట్..’’ అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోపై కొత్త కోడలు లావణ్య స్పందిస్తూ.. థ్యాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్ద కోడలు..’’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.