Homebreaking updates newsవిడాకులు షోయబ్ కుటుంబానికిఇష్టం లేదట..

విడాకులు షోయబ్ కుటుంబానికిఇష్టం లేదట..

భారత్ సమాచార్, జాతీయం : సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల విషయం, షోయబ్, నటి సనా జావేద్ పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా వీరి విడాకుల విషయమై మరికొన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. స్పోర్ట్స్ కపుల్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయారంటే గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తమ మాటలు, చేష్టల ద్వారా పరోక్షంగా వాటిని ఖండించుకుంటూ వచ్చారు. కానీ తాజాగా షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలు నిజమేనని అందరికీ తెలిసింది. ఇదిలా ఉండగానే.. రీసెంట్ గా సానియా తన ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టిన ఓ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు ఇందులోనే ఆమె పరోక్షంగా పేర్కొంది.

తాజాగా సానియా, షోయబ్ విడిపోవడానికి కారణాలు ఇవే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సనా, షోయబ్ గత మూడేండ్లుగా రహస్యంగా కలుసుకుంటున్నారని.. అయితే ఇప్పటికే సనాకు ఉమైర్ జస్వాల్ తో పెళ్లయిందని పాక్ కు చెందిన ఓ మీడియా తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ క్రమం తప్పకుండా కలుసుకోవడం మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ ఏదైనా షోకు వచ్చే ముందు సనాను గెస్ట్ గా పిలిస్తే వస్తానని కండీషన్ పెట్టేవాడని ఆ మీడియా పేర్కొంది. పెళ్లి కొద్దిరోజుల ముందే సనా విడాకుల విషయం ఉమైర్ కు చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమైర్ షాక్ అయ్యాడట.

ఇక సానియా, షోయబ్ విడాకుల వ్యవహారం శాంతియుతంగా ముగిసిందని.. విడిపోయిన విషయం సైతం ఎవరికీ తెలియలేదని.. ఇదంతా చాలా సైలెంట్ గా జరిగిందని పాక్ మీడియా పేర్కొంది. విడిపోయే విషయంలో షోయబ్ కుటుంబం కూడా సానియాకే మద్దతు తెలిపిందని తెలిపింది. షోయబ్, సనా వివాహానికి అతడి కుటుంబ సభ్యులు కూడా హాజరుకాలేదని చెప్పింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు..

ఆ ఊళ్లో అందరికీ ఇద్దరు భార్యలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments