Homemain slidesబైక్ కోసం సగం దేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది

బైక్ కోసం సగం దేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది

భారత్ సమాచార్, అంతర్జాతీయం : పాకిస్తాన్ తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఘనత ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా ‘సామ్ బహుదూర్’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన సామ్ మాణిక్ షా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.

1971 యుద్ధం సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ ఉన్నారు. భారత్, పాక్ విభజనకు ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్ మంచి ఫ్రెండ్స్. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటూ వేర్వేరుగా లేవు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉండేది. ఆ సైన్యంలో మాణిక్ షా, యహ్యా ఖాన్ కలిసి పని చేశారు. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ సమయంలో మాణిక్ షాకు ఎరుపు రంగు బైక్ ఉండేది. అది యహ్యా ఖాన్ కు ఎంతగానో నచ్చింది. ఆ బైక్ ను వెయ్యి రూపాయలకు మాణిక్ షా నుంచి యహ్యా ఖాన్ కొన్నారు. అయితే ఆ వెయ్యి రూపాయలు ఇవ్వకుండానే యహ్యా ఖాన్ దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిపోయారు.

1971 నాటికి యహ్యా ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయిపోయారు. ఆ సమయానికి మాణిక్ షా భారత సైన్యానికి చీఫ్ గా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)ను పాకిస్తాన్ నుంచి వేరు చేయడానికి యుద్ధం జరిగింది. మాణిక్ షా నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ఓడించింది.

యుద్ధం తర్వాత మాణిక్ షా మాట్లాడుతూ..‘‘ నా బైక్ డబ్బుల కోసం 24 ఏండ్ల పాటు ఎదురు చూశాను. యహ్యా ఖాన్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సగం దేశాన్ని ఇచ్చేశాడు’ అని చతురోక్తి విసిరాడు. సీరియస్ విషయంలోనూ ఇలా హాస్యాన్ని అద్భుతంగా పండించడం మాణిక్ షా లాంటి కొందరికీ మాత్రమే సాధ్యం.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

భారత్ బంగారాన్ని ఎందుకు నిల్వ చేస్తుందో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments