Homebreaking updates newsఆ హీరోయిన్ నన్ను చితకబాదింది.. శ్రద్ధాదాస్ కామెంట్స్ వైరల్

ఆ హీరోయిన్ నన్ను చితకబాదింది.. శ్రద్ధాదాస్ కామెంట్స్ వైరల్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఓ బాలీవుడ్ హీరోయిన్ తనను దారుణంగా కొట్టిందని హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్నారా చోప్రా. ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కు కజిన్ అవుతుంది. హిందీ, తమిళ సినిమాలతో పాటు తెలుగులోనే మన్నారా నటించింది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 17లోనూ పాల్గొంది. ఈ తరుణంలో మన్నారా చోప్రాపై శ్రద్ధా దాస్ ఆమెపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మన్నారా చోప్రా, శ్రద్ధాదాస్ కలిసి ‘జిద్’ అనే హిందీ సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో మన్నారా చోప్రా, శ్రద్ధాదాస్ మధ్య పెద్ద గొడవ జరిగిందట. సినిమా కథలో భాగంగా శ్రద్ధాను మన్నారా తోసే సన్నివేశం ఉందట. నెమ్మదిగా నెట్టుమని చెప్పినా కూడా మన్నారా వినకుండా గట్టిగా నెట్టేసిందట. దాంతో మెట్లు తగిలి శ్రద్ధా దాస్ కు గాయాలయ్యాయట. అలాగే ఓసీన్ లో కావాలనే శ్రద్ధా ఛాతిపై మన్నారా స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిందట. మరో సన్నివేశంలో డైరెక్టర్ కట్ చెప్పినా కూడా రెచ్చిపోయి శ్రద్ధాను చితకబాదిందట. ఓ ఫైట్ సీన్ లో డమ్మీ స్టిక్ తో కాకుండా రియల్ స్టిక్ తో కొట్టిందని.. మన్నారా కారణంగా తన శరీరంలో దాదాపు 30 గాయాలు అయ్యాయని శ్రద్ధా దాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ గొడవలపై శ్రద్ధాదాస్ స్పందించింది. బిగ్ బాస్ సీజన్ 17 ఫినాలేకు ముందు తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీపై కానీ నేను ఏ మీడియా వ్యక్తికి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కనీసం నేను పర్సనల్ పీఆర్ వోను కూడా పెట్టుకోలేదు. నేను కావాలనుకుంటే ట్విటర్ లోనే ఇన్ స్టాగ్రామ్ లోనో వీడియో రిలీజ్ చేసి నాకు కావాల్సినంత పబ్లిసిటీ పొందుతాను. కానీ నేను అలాంటి పనులు చేయను. కానీ వీటన్నంటికీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను.’’ అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శ్రద్ధా పోస్ట్ వైరల్ అవుతోంది.

మరికొన్ని సినీ సంగతులు…

సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments