Homebreaking updates news'అలా చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే'

‘అలా చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే’

భారత్ సమాచార్, రాజకీయం ; హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా బేసిన్‌ నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదియ్యాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కృష్ణ జలాలపై కొట్లాడేందుకు మాజీ సీఎం కేసీఆర్ సమరశంఖరావం పూరించనున్నట్లు కేటీఆర్ అన్నారు. ఈ నెల 13న ఛలో నల్గొండ సభను భారీగా విజయవంతం చేయాలన్నారు. నల్గొండ సభకు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలి రావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని కాల్వలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్‌లు ఉన్నాయనే అంశాలను కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవచ్చు అన్నారు. కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్. కాళేశ్వరంలో కాంగ్రెస్ నాయకులకు ఓనమాలు కూడా తెలవదన్నారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం కట్టిందే మేము అని, కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు.

కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాగారం నిలుస్తుందన్నారు. దేశానికి అన్నపూర్ణగా మారింది ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలన్నారు. ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందిగా, మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే” అవుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

అన్నదాతల కోసం కేసీఆర్ పొలం బాట

RELATED ARTICLES

Most Popular

Recent Comments