Homemain slidesకేసీఆర్ కు సీఎం రేవంత్‌రెడ్డి సర్‌ప్రైజ్

కేసీఆర్ కు సీఎం రేవంత్‌రెడ్డి సర్‌ప్రైజ్

భారత్ సమాచార్, హైదరాబాద్: మాజీ సీఎం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ పంపించారు. 70 ఏళ్లు పూర్తి చేసుకుని మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కేసీఆర్‌, మీకు జన్మదిన శుభాకాంక్షలు , మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బర్త్‌డే వేడుకలు:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్‌కు విషెస్ చేస్తున్నారు. మరికొందరు అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రిలో పండ్లను పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆన్ లైన్ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

కేటీఆర్ లాంటి మంత్రిని చూడలేం.. నెటిజన్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments