HomeUncategorizedఅతడే సంజయ్ లీలా భన్సాలీ...

అతడే సంజయ్ లీలా భన్సాలీ…

భారత్ సమాచార్, సినీ టాక్స్ :  రెండున్నర గంటల సినిమాలో కచ్చితంగా ఎక్కడో ఒక చోట తప్పక అనిపిస్తుంది… రెండు కన్నులు సరిపోవే ఈ దృశ్య కావ్యం చూడటానికీ అని, అలా ఉంటుంది ఆయన దర్శకత్వం. ఆయన సంధించిన బాణీలు కొన్నిసార్లు మనసును హత్తుకుంటాయి, మరోసారి గుచ్చుకుంటాయి, ఇంకోసారి హృదయాన్ని కలవరపెడతాయి. అతడే సంజయ్ లీలా భన్సాలీ. నేడు ఈ సినీ జీనియస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రేమికులు, భారతీయ సినీ సెలబ్రిటీలు నేషనల్ అవార్డ్ విన్నిర్ సంజయ్ లీలా భన్సాలీకి ఆన్ లైన్ వేదికగా నెట్టింట జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భన్సాలీ 1963 వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన జన్మించాడు.  తన పేరులో ఉండే “లీలా” అనే పేరును తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా పెట్టుకున్నాడు. సంజయ్ ప్రముఖ భారతీయ దర్శకుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత, భన్సాలీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు స్థాపకుడు, నిర్మాత .

బాలీవుడ్ దర్శకుడు  వినోద్ చోప్రా వద్ద మొదటగా సహాయ దర్శకుడిగా సినీ  కెరీర్ ను ప్రారంభించాడు సంజయ్. ఖామూషీ:ది మ్యూజికల్ అనే సినిమాతో దర్శకునిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమా అనుకున్న ఫలితాన్ని అందివ్వలేకపోయింది కానీ మరిన్ని సినీ అవకాశాలను అయితే తెచ్చి పెట్టింది.  ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘దేవదాస్’ సినిమాలు తన సినీకెరీర్ మొదట్లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన ప్రతిభకు 7 జాతీయ అవార్డులు, 12 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గీటురాళ్లుగా నిలిచాయి. 2015లో పద్మ శ్రీ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆయన ‘హీరమండీ…ది డైమండ్ బజార్’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

RELATED ARTICLES

Most Popular

Recent Comments