భారత్ సమాచార్, ఆరోగ్యం : ప్రభుత్వం దేశంలోని దారిద్య రేఖకు దిగువున ఉన్న నిరు పేదల కోసం అతి తక్కువ ధరకే అందించే రేషన్ బియ్యాన్ని మీరు అమ్ముకుంటున్నారా ? అయితే ఈ కథనం మీ కోసమే మరి. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మీరు రేషన్ బియ్యయే తింటాం అంటారు. ఇక బ్లాక్ మార్కెట్ లో వీటిని అమ్ముకోం అని కూడా అని మీరే చెబుతారు.
ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇప్పటికే అనేక పర్యాయాలు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా జింక్, విటమిన్ A, B6, థయమిన్, రైబోప్లావిన్, నియాసిస్ వంటి పోషకాలను ప్రజా ఆరోగ్యం కోసం కలుపుతున్నారు. వీటి వల్ల దేశంలో అత్యధిక మంది మహిళల్లో ఉన్న రక్తహీనత సమస్యకు పరిష్కారం దొరుతుంది. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ బియ్యం వండుకోకుండా కేజీ కి రూ. 10 కోసం అమ్ముకుంటే ఆరోగ్య పరంగా చాలా నష్టపోతారని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుననారు.