భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : భాగ్యనగరంలో ఘరానా మోసగాళ్ల ఎత్తుగడలకు అంతు పొంతు లేకుండా పోతోంది. కొత్తగా ఏఐ సాంకేతికత సాయంతో కూడా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ మోసాలకు తెరతీశారు. కేవలం 3 రోజుల్లోనే రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ట్రేడింగ్ పేరుతో నగరంలోని ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేశారు ఈ చీటర్స్. ఫెడెక్స్ కొరియర్ పేరుతో బాధితులకు రూ. 2.5 కోట్లకు పైగా టోకరా వేశారు. మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు కాజేశారు. లక్నోకు చెందిన చీటర్స్ ను సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా విద్యావంతులైన న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు కూడా వీరి వలలో చిక్కుకోవటం గమనార్హం. సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారని సాధారణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ట్రేడింగ్ పేరుతో టోకరా
RELATED ARTICLES