Homemain slidesఅధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

భారత్ సమాచార్, రాజకీయం : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా నేడు తెలిపారు.

‘‘హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని గారు నిర్ణయించినందున ఇది చారిత్రాత్మకమైన రోజు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో భాగమై ఉండేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి.

యువతలో దేశభక్తి జ్వాల రగిలించి, స్వాతంత్య్ర ఉద్యమంలో మన చిహ్నాలను చిరస్థాయిగా నిలిపే మోదీ గారి ఈ కీలక నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను.’’ అంటూ అమిత్ షా తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో తెలుగులో రాసుకొచ్చారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చివరి కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని రాజకీయ సంగతులు…

లాల్ కృష్ణ అద్వానీ…జీవిత విశేషాలు ఎన్నెన్నో

RELATED ARTICLES

Most Popular

Recent Comments