భారత్ సమాచార్, జాతీయం ; విశ్రాంత నౌకా దళాధిపతి అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రాందాస్ నేడు అనారోగ్య కారణాల రిత్యా మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల వయస్సులోనే 1949లో సంయుక్త సైనిక దళాల్లో చేరారు లక్ష్మీనారాయణ్ రాందాస్. ఇక ఆ తర్వాత నౌక దళంలో చేరి అంచెలంచెలుగా ఆ విభాగానికే దళాధిపతిగా ఎదిగారు.
1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ సమయంలో (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం) తూర్పు నౌకా దళంలో ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ బియాస్‌కు అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రాందాస్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ కు చెందిన 93 వేల మంది సైనికులు తప్పించుకొని పోకుండా చేసి వారు లొంగిపోయేలా చేయటంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆ యుద్ధ సమయంలోనే పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ కు (ప్రస్తుత బంగ్లాదేశ్) నిషిద్ధ వస్తువులను తరలిస్తున్న పలు నౌకలను ఆయన సారధ్యంలోని ఐఎన్ఎస్ బియాస్ అడ్డుకుంది.