భారత్ సమాచార్, ఢిల్లీ ; దేశ వ్యాప్తంగా 2024 పార్లమెంటు ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు సీఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు.
మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ ఏప్రిల్ 19 న మొదలై జూన్ 04 న ఫలితాలు వెల్లడించటంతో ముగుస్తుంది.
1.ఏప్రిల్ 19న మొదటి దశ
2.ఏప్రిల్ 26న రెండవ దశ
3.మే 7న మూడవ దశ
4.మే 13న నాలుగో దశ (మే 13 న ఏపీ, తెలంగాణ పోలింగ్. )
5.మే 20న ఐదవ దశ
6.మే 25న ఆరవ దశ
7.జూన్ 1న ఏడవ దశ పోలింగ్ ను నిర్వహించనున్నారు.
ఫలితాలను జూన్ 4 న వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్డ్
ఇకపై బ్యాంక్ లావాదేవీల పైన ఈసీ నిఘూ ఉంటుందని సీఈసీ పేర్కొంది. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది, ఎన్నికలకు దూరంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు.