Homemain slidesజగదేక వీరుడు... అతిలోక సుందరి

జగదేక వీరుడు… అతిలోక సుందరి

భారత్ సమాచార్ ; జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జంటగా ఆర్సీ16 మూవీ పూజ కార్యక్రమం నేడు లాంఛనంగా జరిగింది. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకుడు. ఈ డైరెక్టర్ రెండో కథతోనే భారీ బడ్జెట్ తో గ్లోబర్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ చేయటం విశేషం. సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించాడు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌ారు. బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకుంది. సుకుమార్, దిల్ రాజు హాజరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ ‘గేమ్ ఛేంజర్’, జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతున్నట్టు దర్శకుడు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments