భారత్ సమాచార్ ; అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని సమూలంగా మార్చేసిన సినిమా ‘మగధీర’. రామ్ చరణ్ తేజ్ ని మెగా పవర్ స్టార్ గా తీర్చిదిద్దిన సినిమా అది. ‘ఆర్ ఆర్ ఆర్’తో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చరణ్. రెండో మూవీతోనే ఇండ్రస్టీ రికార్డులు తిరగరాశాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆల్ టైం ఇండ్రస్టీ హిట్ ‘మగధీర’ కూడా చేరింది. చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27 న ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ థియేటర్లలో మగధీరుడు సందడి చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఉదయం 8 గంటలకే షోలను వేయనున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎం ఎం కీరవాణీ సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కాజల్ మిత్ర వింద మహారాణిలా గుర్తుండిపోయింది. అల్లు అరవింద్ నిర్మాత. విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ధీర ధీర పాటకు గాను ఉత్తమ జాతీయ గీతం అవార్డు లభించింది. ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు లభించాయి.