Homemain slides‘ఫ్యామిలీ స్టార్ ’ ట్రైలర్ సూపర్ హిట్

‘ఫ్యామిలీ స్టార్ ’ ట్రైలర్ సూపర్ హిట్

భారత్ సమాచార్ ; కుటుంబంతో సరదాగా, సంతోషంగా ఉండే ‘ఫ్యామిలీ స్టార్ ’ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. వాళ్ల ఇంటి పైకి ఆ తర్వాత తన లైఫ్ లోకి వస్తుంది కథానాయిక మృణాల్ ఠాకూర్. దీంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇక యాక్షన్ మూడ్ లోకి వెళతాడు విజయ్. ఈ ఫన్ మూడ్ యాక్షన్ గా ఎందుకు మారిందో తెలియాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య కాలంలో మళ్లీ మళ్లీ ఒక ట్రైలర్ ను ఉండే ప్రచార చిత్రం విడుదల అవ్వటం చాలా అరుదు. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ మాత్రం రెండు, మూడు సార్లు చూడచ్చు అనేలా ఉంది.

‘గీతా గోవిందం’ చిత్రం దర్శకుడు పరశురామ్ ని స్టార్ ని చేస్తే, విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ ని చేసింది. వీరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తుందంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తాజా ట్రైలర్ ని చూస్తుంటే ఆ అంచనాలను అందుకున్నట్టే ఉంది. ప్రచార చిత్రం చాలా ప్రామిసింగ్ గా ఉంది. విజయ్ డైలాగ్స్, యాక్షన్, హీరోయిన్ అప్పీరెన్స్ ఇందులో హైలెట్. ట్రైలర్ ఆసాంతం మంచి ఎంటర్టైనర్ గా సాగుతోంది. ‘ లిప్ట్ లు ఉన్నాయని ఎక్కేసీ, సిగరెట్ లు ఉన్నాయని కాల్చేసీ, మందు ఉందని తాగేస్తే, హెల్త్.., కోపం తీరిపోతుంది అంటే నన్ను కొట్టవే బాబు’ అనే డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ ఫ్రెస్ గా , క్యూట్ గా కనిపిస్తోంది. గోపీ సుందర్ సంగీతం వినసొంపుగా ఉంది. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏఫ్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సంభందిత సినీ విశేషాలు…

‘ఫ్యామిలీ స్టార్’నుంచి కళ్యాణ గీతం

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments