భారత్ సమాచార్, సినీ టాక్స్ ; ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా నెట్టింట విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ప్రచార చిత్రం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. నేపథ్య సంగీతం బాగుంది. ప్రేమ,కులం, భారత రాజ్యాంగం వంటి సున్నిత అంశాల మీద కథనం సాగుతోంది. నటుడు పార్వతీశం విలేజ్ లుక్ లో చూడటానికి బాగున్నాడు. పాత్రల్లో బాగా ఒదిగిపోయాడు. నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్రలో ఐశ్వర్య కనిపిస్తోంది. ప్రముఖ నటుడు సాయి కుమార్ విలన్ గా కనిపిస్తున్నాడు. ప్రచార చిత్రంలో కొంచెం యాక్షన్ కూడా కనిపిస్తోంది. ‘ పనులు నేర్చుకుంటే సుఖంగా బతకగలం కానీ, గౌరవంగా బతకలేమండీ, మీ లాంటి అనామకుల చావు బతుకులు, మా నిర్ణయాల మీదే అధారపడి ఉంటాయి’ వంటి సంభాషణలు ట్రైలర్ లో హైలెట్. బతకటం మనిషి హక్కు అనే లైన్ పై కథను రూపొందిచినట్టు తెలుస్తోంది.
వెంకటరమణ దర్శకుడు. సిద్దార్థ్ నిర్మాత. రాజా సంగీతం సమకూర్చాడు. అన్ని కుదిరితే ఈ వేసవిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకనిర్మాతలు.