భారత్ సమాచార్, హైదరాబాద్ ; ఈ ఏడాది తెలుగు తెరపై ఎక్కువగా హార్రర్ కామెడీ జోనర్ కనిపించలేదు. సినీ ప్రేమికులకు ఆ లోటును పూడ్చటానికి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ ముందుకొచ్చింది. 2014లో విడుదలైన ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ ఇది. నటిగా కథానాయిక అంజలికి ఇది 50 వ చిత్రం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ వేదికగా జరిగిన ఈవెంట్ లో దర్శకనిర్మాతలు రిలీజ్ చేశారు. ప్రచారచిత్రం చాలా ప్రామిసింగ్ గా ఉంది. భయపెడుతూ నవ్విస్తున్న ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. సినిమా షూటింగ్ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి అండ్ కో చేసే రచ్చ అంత ఇంతా కాదు. దెయ్యాలతో షూటింగ్ కాన్సెప్ట్ ట్రెలర్ కి హైలెట్ గా నిలిచింది. సీనియర్ కమెడియన్స్ సత్య, సునీల్, ఆలీ కామెడీ టైమింగ్ బాగుంది. నేపథ్య సంగీతం భయపెడుతూ ఆకట్టుకుంటోంది. సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి నిర్మాత. శివ తుర్లపాటి దర్శకుడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏఫ్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ముందే హిట్ అయిన సినిమాకి సీక్వెల్ కాబట్టి సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు మరింతగా పెంచేసింది.