Homemain slidesమొదటి రోజు 39.58% పెన్షన్ పంపిణీ

మొదటి రోజు 39.58% పెన్షన్ పంపిణీ

భారత్ సమాచార్ ; మొత్తానికి అనేక రాజకీయ మలుపులు, అధికార, ప్రతిపక్షాల ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలను రద్దు చేయటం వలన సాధారణం కంటే మూడు రోజులు ఆలస్యంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా మొదటి రోజు(నిన్న మధ్యాహ్నం నుండి) 39.58% పెన్షన్ పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. పెన్షన్ పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ నేడు వెల్లడించింది. తలకి టోపి పెట్టుకోవాలి/రూమాలు కట్టుకోవాలని సూచించింది. ఎక్కువగా మంచి నీరు, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసము,కొబ్బరినీరు తాగాలని తెలిపింది. ఈ నేపథ్యంలో మరికొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అవి…

✓ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురు వారం) నుంచి మరో రెండు రోజులు కూడా ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

✓ ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు పేర్కొన్నారు.

✓ ఈ విభాగాల పింఛన్ దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లే లబ్దిదారులు కచ్చితంగా ప్రభుత్వం గుర్తించిన ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాలని సూచించారు.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

ఉచితాలేవీ కూడా ఉచితం కానే కాదు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments