Homemain slides‘సత్య’ మూవీ టీజర్ రిలీజ్

‘సత్య’ మూవీ టీజర్ రిలీజ్

భారత్ సమాచార్ ; బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లైఫ్ ని, నిరుపేద కుటుంబ కష్టాలను హైలెట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘సత్య’. ఈ తమిళ మూవీ ని తెలుగు లో డబ్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను నెట్టింట విడుదల చేశారు. ఒక పాఠశాల విద్యార్థి జీవితాన్ని ఎలివేట్ చేస్తూ తెరకెక్కిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి. ఒక స్టూడెంట్ జీవితంలోని కొన్ని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ టీజర్ సాగుతోంది. సంభాషణలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సెన్సిబుల్ గా ఉంది.

హమరేష్ లీడ్ రోల్ చేస్తున్నాడు. నేచురల్ బ్యూటీ ప్రార్థన సందీప్ కథానాయిక. ఈ మూవీని తెలుగులో నిర్మాత శివ మల్లాల ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. వాలి మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సుందరమూర్తి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సమ్మర్ లోనే ఈ మూవీని సినీ ప్రేమికుల ముందుకు తీసుకురావటానికి దర్శకనిర్మాతలు సన్నద్ధం చేస్తున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments