భారత్ సమాచార్, హైదరాబాద్ ; తొలి తరం న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నేడు మరణించారు. రెండు రోజుల క్రితం గెండె పోటు కారణంగా నగరంలోని హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. ఆయన 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్ లో వార్తలు చదవటం ప్రారంభించారు. ఆయన 2011లో దూరదర్శన్ లోనే పదవీ విరమణ చేశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన జర్నలిజంలో లైఫ్ టైమ్ అవీచ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు. ఆయన పదేళ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసే వార్తలు చదివేవారు.
ఆయన మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశంలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.