Homemain slidesస్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు

స్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు

భారత్ సమాచార్, రైల్వేకోడూరు ; ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ హీట్ తో పాటుగా పొలిటికల్ హీట్ కుడా బాగా వేడ్కెక్కింది. విశ్రాంతి, విరామం కూడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విపక్ష పార్టీల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటర్లపై అపరిమిత ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. ఏపీలో ఏ మారుమూలకు వెళ్లినా కూటమి ప్రభుత్వం రాబోతోందన్న సంకేతం కనిపిస్తోందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనాన్ని స్థానిక వైసీపీ నాయకులు ఇంధనంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎర్రచందనం మాఫియా డాన్ గంగిరెడ్డితో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కలిసి తిరుగుతున్నారన్నారు. జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డికి యువత భయపడాల్సిన అవసరం లేదన్నారు. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదని యువతకి సూచనలిచ్చారు.

‘‘కష్టాలు, త్యాగాలు, బలిదానాలు మనవి.. సంపద జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిదా..? వీళ్లకు దోపిడీ మీద ఉన్న ధ్యాస పాలన మీద లేదు. వీళ్ల ఐదేళ్ల పరిపాలన కాలంలో 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైతే వీళ్లకు పట్టదు. రాయలసీమ ఏమైనా జగన్ గుత్తాధిపత్యమా…? ఎర్రచందనాన్ని ఇంధనంలా వాడుకుంటూ, అడ్డచ్చినోళ్లను నరికేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమే, ప్రజలను బాధిస్తున్న ప్రతి ఒక్క వైసీపీ గూండాన్ని వీదుల్లోకి లాక్కొస్తానని’’ కోడూరు సభలో పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

నిజంగా యువత ధైర్యం చేసి రోడ్ల మీదకు వస్తే జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..? అని ప్రశ్నించారు. నేను వచ్చినప్పుడు బయటకు రావడం కాదు. తప్పు జరిగినప్పుడు బయటకు రావాలన్నారు. ధైర్యం లేని సమాజం కుళ్లిపోతుందన్నారు. ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తామన్నారు. సీపీఎస్ కు బలమైన పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. జిల్లాలను అడ్డగోలుగా విభజించారు, దానిని సరిచేస్తామన్నారు. రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

RELATED ARTICLES

Most Popular

Recent Comments