HomeUncategorizedఆర్డీటీ సెట్-2024కు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్డీటీ సెట్-2024కు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ సమాచార్, జాబ్స్అడ్డా ; తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అత్యున్నత ప్రతిభ కనబర్చిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కొర్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) అనే స్వచ్చంద సంస్థ. అనంతపురం, కర్నూలు జిల్లాలలో ఈ ట్రస్ట్ ఉన్నత స్థాయి విద్యా సంస్థలను నడుపుతోంది. తాజాగా పదొ తరగతి పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి RDT CET-2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ స్టేస్ సిలబస్ లో ఉత్తీర్ణులైన వారు కచ్చితంగా 500 ఆపైన మార్కులు వచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయటానికి అర్హులు. C.B.S.E (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కచ్చితంగా 420 ఆ పైన మార్కులు వచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయటానికి అర్హులు. దరఖాస్తులు అందించటానికి మే 4 చివరి తేదీ. ఆ లోపు విద్యార్థులు ఏరియా ఆర్. డి.టి ఆఫీస్ కి వచ్చి దరఖాస్తును అందించాలి. దరఖాస్తు చేయటానికి విద్యార్థులు కచ్చితంగా ఈ కింది సర్టిఫికెట్లను తీసుకురావాలి. ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఉచితంగా విద్య, వసతి సదుపాయం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షను మే 19వ తేదీన నిర్వహిస్తారు.

1. టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్
2. పదో తరగతి హాల్ టికెట్
3. విద్యార్థి ఆధార్ కార్డు
4. తండ్రి ఆధార్ కార్డు
5. తల్లి ఆధార్ కార్డు
6. విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికెట్
7. కుటుంబం యొక్క రేషన్ కార్డు (బీపీఎల్ కార్డు)
8. కులం, కుటుంబం యొక్క ఆదాయం తెలిపే సర్టిఫికెట్
9. విద్యార్థివి నాలుగు పాస్ ఫోర్ట్ సైట్ ఫోటోలు. విద్యార్థి యొక్క తల్లిదండ్రులలో ఎవరో ఒకరు తప్పకుండా హాజరుకావాలి.

ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటికి చెందిన విద్యార్థులందరూ ఏ పాఠశాల నందు చదివిన కూడా దరఖాస్తు చేయటానికి అర్హులే. బీసీ మరియు ఓసీ కమ్యూనిటికి చెందిన విద్యార్థులు మాత్రం కేవలం ప్రభుత్వ పాఠశాల నందు చదివిన వారు మాత్రమే దరఖాస్తు చేయటానికి అర్హులు.
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ తల్లిదండ్రులు కలిగిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేయటానికి అర్హత ఉంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన వారు అర్హులు కారు. పరీక్ష నిర్వహించే తేదీ-19.05.2024

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments