Homemain slidesమరో ప్రపంచ సమరానికి భారత క్రికెట్ సైన్యం

మరో ప్రపంచ సమరానికి భారత క్రికెట్ సైన్యం

భారత్ సమాచార్, క్రీడలు ; వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ నెలలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ కు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలు ప్రకటించటానికి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మే 1వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో అన్ని దేశాల జట్లను ఆయా దేశాల క్రిక్రెట్ బోర్డులు నేడు అధికారికంగా ప్రకటించాయి. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 1 న మొదలై 29వ తేదీన ముగియనుంది.

ఐపీఎల్ లో చాలా మంది దేశవాళీ ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ మధ్య బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) నేడు అధికారికంగా టీంఇండియా టీం20 2024 ప్రపంచ కప్ లో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కి స్థానం దొరకలేదు. రిషబ్ పంత్ మంచి కమ్ బ్యాక్ చేశాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాలా మంది ఆల్ రౌండర్లకు చోటు కల్పించారు. బ్యాకప్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కు చోటు లభించింది. నేడు ఇండియా సారథి రోహిత్ శర్మ జన్మదినం కావటం మరో విశేషం…

టీ20 ప్రపంచకప్ 20204 టోర్నీకి ఎంపికైన భారత జట్టు ఇదే
భారత జట్టు: రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా (విసి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికె), సంజు శాంసన్ (వికె), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్

రిజర్వ్‌ ఆటగాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ, తబ్రాహమ్, తబ్రహమ్, తబ్రహమ్ ట్రిస్టన్ స్టబ్స్.

రిజర్వ్‌ ఆటగాళ్లు: నాంద్రే బర్గర్ మరియు లుంగి ఎన్గిడి.

ఇంగ్లీష్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

న్యూజిలాండ్ జట్టు ప్రకటన
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (సి), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టి. సౌతీ. ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్

రేపటికి మొత్తం ప్రపంచ కప్ టోర్నీలో బరిలో ఉన్న జట్ల వివరాలన్ని కూడా అందుబాటులో ఉంటాయి.

మరికొన్ని ఆసక్తికర సంగతులు…

మన కుర్రాళ్లు ఆరోసారి కొడతారా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments