భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
ఈ దశాబ్దంలోనే అత్యధిక ఉష్టోగ్రతలు ఈ సంవత్సరమే నమోదు అవుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగే అవకాశాలే తప్ప సమీప భవిష్యత్ లో తగ్గే అవకాశాలు కూడా లేవని శాస్ర్తవేత్తలు తేల్చి చెబుతున్నారు. దీనికి కారణం నాగరికత పేరుతో మనుషులు చేసుకున్నదే. సమ్మర్ వస్తే కూలర్ లో నీళ్లు నింపే బదులు ఒక మొక్కకి నీళ్లు పోస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. ఈ తంతు ఇలాగే కొనసాగితే మన భవిష్యత్ తరాలు ఎలాంటి పరిస్థితుల్లో జీవించాలో ఊహించాలంటేనే కష్టంగా ఉంది.
2030 – 2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 58 – 60 డిగ్రీలకి చేరబోతుందని కొందరి పర్యావరణ శాస్త్రవేత్తల అంచనా. మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి, శవాల కుప్పలు తప్ప, మనుషులు మిగిలే పరిస్థితి ఉండదు.
ప్రస్తుత మా‘నవ’ సమాజం ఇలా ఉంది
- పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు…
- కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు..
- అయితే అతి వర్షాలు, లేకపోతే అల్ప వర్షాభావ పరిస్థితులు..
- భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు..
- తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం..
- భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పేరుకుపోతున్నాయి…
- నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి..
- సముద్రాలు అన్నీ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి..
- కొత్త కొత్త వైరస్ లు, క్యాన్సర్లు
ఇంకో పది సంవత్సరాల్లో ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద 40% నాగరికత అంతరించబోతుందని కొందరి వాదన. తుఫానులు, భూకంపాలు, పేదరికం,ఆకలి, అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయని వారంటున్నారు.
మన తరం, ఆ తర్వాత తరాల పిల్లలు హాయిగా సుఖంగా బ్రతకాలంటే,, కావలసింది,, ఈ దేవుళ్ళు, మతాలు కాదు … వ్యర్ధాలు లేని భూమి కావాలి… స్వచ్ఛమైన గాలి కావాలి… కలుషితాలు లేని నీరు కావాలి…
మీ తర్వాత తరాల పిల్లల మనసుల్లో విద్వేషపు విష బీజాలు నాటడం మాని, అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటాలని పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు. ఇంటి పై భాగాల్లో పక్షులకి, జంతువులకి ఒక పాత్రలో తాగటానికి మంచినీరు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
గాలి+నీరు+నీడ= చెట్టు
సాటి మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల, నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.
మతాలకు పుట్టిన వాళ్లలాగా కాకుండా, మనుషులకు పుట్టినవాళ్లుగా జీవించండి అంటూ పర్యావరణ ప్రేమికులు హితబోధ చేస్తున్నారు.
(కొన్ని మార్పులు-చేర్పులతో వాట్సాప్ యూనివర్సిటీ నుంచి సేకరణ)