భారత్ సమాచార్ నెట్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో, 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ హాయాంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై అర్ధవంతమైన చర్చకు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన ఘనతలు, విజయాలు, సానుకూల ఫలితాలతో పాటు 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు కానీ అబద్ధాలను ఆశ్రయించడం దురదృష్టకరం అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చిన నిధులపై సీఎం చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఆ అబద్దాలు సరికాదు:
ముఖ్యమంత్రితో సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు అబద్ధాలు మాట్లాడటం ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9లక్షల కోట్లకుపైగా నిధులను ఇచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
చర్చకు నేను సిద్ధం:
2014 – 2024 కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై తాను చర్చకు వస్తానని 2004-2014 కాలంలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి ఏమిచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కొడంగల్ అమవీరుల స్థూపమా, తేదీ మీరే నిర్ణయించండని సీఎంకు సూచించారు. వాస్తవాలతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఏం ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి:
ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్, రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోదీ ఏం చేశారో తాను వివరిస్తాన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో రేవంత్‌రెడ్డి తెలపాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి సవాల్ చేశారు.
మరిన్ని కథనాలు: