Homemain slidesఫీల్ మై లవ్...

ఫీల్ మై లవ్…

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

‘‘నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్…’’ అంటూ లెక్కల మాస్టారు, స్క్రీన్ ప్లే జీనియస్ సుకుమార్ వెండితెరపై తెలుగు సినీ ప్రేమికులకు లవ్ అనే అవుట్ ఆఫ్ ది సిలబస్ సబ్జెక్ట్ ను భోదించాడు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున (మే 7వతేదీ, 2004) ‘ఆర్య’ ఫీల్ మై లవ్ … అంటూ తెలుగు సినీ జనాలను అమితంగా మెప్పించాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్ ఇతర ప్రముఖ తారాంగణం, సాంకేతిక నిపుణులు ‘ఆర్య’ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటు సోషల్ మీడియా (ఎక్స్)లో పోస్ట్ లు చేస్తున్నారు. సినిమా విడుదలై 2 దశాబ్దాలు అయిన సందర్భంగా ఫీల్ మై లవ్ … అంటూ ప్రత్యేక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఆ పోస్ట్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇలా కూడా లవ్ ని ఎక్స్ ప్రెస్ చేయచ్చు అనేలా యూత్ ని మెప్పించి, ప్రభావితం చేసిన సినిమా ‘ఆర్య’. యువతలో వన్ సైడ్ లవ్ అనే ఫీలింగ్ ని కలిగించిన మూవీ ఇది. బన్నీకి హీరోగా ‘ఆర్య’ రెండవ సినిమానే. కానీ, ఇందులోని నటన, డాన్స్ చూస్తే అలా అనిపించదు. దర్శకుడు సుకుమార్ కి కూడా ఇది మొదటి సినిమా. కానీ దేవిశ్రీ మ్యూజిక్, రత్నవేలు ఛాయగ్రహణం సాకారంతో సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు లెక్కల మాస్టారు. ఇందులోని సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అనచ్చు. కథలోని ఎమోషన్ ని బాగా కనెక్ట్ చేసింది మ్యూజిక్ యే. బన్నీ ని స్టైలిస్టార్ గా మార్చిన మూవీ కూడా ఇదే.

ఇక అప్పటి నుంచి బన్ని-సుక్కు-దేవి ల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారింది. రూ.4 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య-2’ కూడా మెప్పించింది. గతేడాది వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ తగ్గేదే లే అంటూ ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించింది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవల్లో ఐకాన్ స్టార్ గా నిలిపింది. ప్రస్తుతం దీనికి సీక్వేల్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ తో ఈ మూవీకి పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.

మరికొన్ని సినీ సంగతులు…

‘లీడర్’ మూవీ రీరిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments