Homemain slidesఈవీఎంలతో వెళ్తున్న బస్సులో మంటలు.. చివరికి?

ఈవీఎంలతో వెళ్తున్న బస్సులో మంటలు.. చివరికి?

భారత్ సమాచార్.నెట్, మధ్యప్రదేశ్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హవా నడుస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ముగిసింది. ఈ క్రమంలోనే పోలింగ్‌ సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో పోలింగ్‌ అధికారులు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో కొన్ని ఈవీఎంలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు. జిల్లాలోని గోల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో సామాగ్రి దగ్ధమైంది. బస్సులో ఆరు పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు, ఓటింగ్‌ మెటీరియల్‌తో పోలింగ్ సిబ్బంది తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు దిగలేకుండా.. బస్సు డోర్‌ ముందు వైపు తాళం వేసి ఉండడంతో వెనుక డోర్, కిటికీ పగులగొట్టి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

కిటికీ పగులగొట్టి ప్రాణాలు రక్షించుకుని:
మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలోని ముల్తాయ్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గౌలా గ్రామ సమీపంలో ఆరు పోలింగ్ స్టేషన్ల నుంచి పోలింగ్‌ సామాగ్రితో బేతుల్‌కు తిరిగి వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపివేయడంతో పోలింగ్ సిబ్బంది ఎలాగోలా బస్సు నుంచి దూకి వారి ప్రాణాలను కాపాడుకోగలిగారు. బస్సు గేర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టుగా పోలీసులు గుర్తించారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు దిగలేకుండా.. బస్సు డోర్‌ ముందు వైపు తలుపు తాళం వేసి ఉండడంతో వెనుక డోర్, కిటికీ పగులగొట్టి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

మరిన్ని కథనాలు:

ఫేక్ సర్వేలతో జర పైలంగా ఉండాలే

RELATED ARTICLES

Most Popular

Recent Comments