Homemain slidesహైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి బర్త్ డే

హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి బర్త్ డే

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చేసిన సినిమాలు కొన్నే అయిన ఆమె సినీ అభిమానుల్లో సంపాదించిన క్రేజ్ మాత్రం వెలకట్టలేనిది. వెండితెరపై ఆమె కన్నీరు పెట్టుకుంటే ప్రేక్షకుల మనసు చెమ్మగిల్లింది, డాన్స్ చేస్తే… వర్షంలో నెమలి లెక్క అంటూ ప్రశంసలు అందుకుంది. చిరునవ్వుతోనే యువత మనసులో స్థానం సంపాదించుకుంది వన్ అండ్ ఓన్లీ పీస్ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవి అనేంతలా దగ్గరైపోయింది.

హీరో డామినేట్ ఇండస్ట్రీలో ఉంటూ, ఇటీవల కాలంలో హీరో నే డామినేట్ చేసేలా వెండితెరపై క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ సాయిపల్లవి. ఆమె 1992వ సంవత్సరం మే 9వ తేదీన తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది. ఈ నేచురల్ బ్యూటీ జార్జీయా లో డాక్టర్ విద్యను కంప్లీట్ చేసింది. సినీ పరిశ్రమలో ఆమె అవకాశాల కోసం కూడా ఎవ్వరిని సంప్రదించలేదు. కథానాయికగా ఆమె మొదటి సినిమా మళయాళంలో చేసింది. అందులో ముగ్గురు కథానాయికలు అయితే అందులో ఒకరు సాయిపల్లవి. ఆ సినిమా పేరు ‘ప్రేమమ్’. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్ని భారీ ఆఫర్స్ వచ్చినా, ఎంత ఎక్కవ రెమ్యునరేషన్ ఇస్తామన్న కూడా ఆమె తనకు నప్పని పాత్రల జోలికి కానీ, యువతను తప్పు దారి పట్టించే యాడ్స్ జోలికి కానీ వెళ్లలేదు. నటన, డాన్స్ తో పాటుగా ఆమె వ్యక్తిత్వతో కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.

ఆమె డేట్స్ కోసం ఎదురు చూసి, సినిమా షూటింగ్ ను డిలే చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి సారిగా శేఖర్ కమ్ముల దర్శకత్వం నటించిన ‘ఫిదా’తో అందరిని ఫిదా చేసేసింది. ఆ తర్వాత తెలుగులో ‘పడి పడి లేచే మనసు’,‘శ్యామ్ సింగ రాయ్’,‘విరాట పర్వం’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో మెరిసింది. అతి తక్కువ సమయంలో పాన్ ఇండియా లెవల్లో లేడి ఓరియటెండ్ మూవీ ‘గార్గి’లో నటించి రికార్డు నెలకొల్పింది. తాజాగా నాగ చైతన్యతో మరోసారి ‘తండేల్’చిత్రంలో నటిస్తోంది. ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా సినీ యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరికొన్ని సినీ సంగతులు…

రౌడీ బాయ్ బర్త్ డే నేడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments