భారత్ సమాచార్, జాతీయం: మనం పోలీసు స్టేషన్‌లో ఛార్జిషీట్ పేరును ఎక్కువుగా వింటుంటాం కదా! కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జిషీట్ చేశారు అని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారి నోట తరచు మనం వినే పదం ఇది. అయితే ఛార్జిషీట్ ఏంటే ఇప్పుడు తెలుసుకుందాం. ‘‘స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ కేసు విషయంలో నిజంగా ఎవరు చేశారు? అనే కోణంలో ఆలోచించి, దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి బ్రీఫ్ గా ఫైల్ తయారు చేసేదాన్నే ఛార్జిషీట్ అంటారు’’ ఇది CrPC Section 173 సెక్షన్ కిందీ ఈ ఛార్జిషీట్‌ను ఫైల్ చేస్తారు.
ఈ ఛార్జిషీట్‌లో మామూలు కేసులే కాకుండా, క్రిమినెల్ కేసుల్లోనూ ఛార్జిషీట్ ఫైలు చేయడం జరుగుతుంది. ఈ ఛార్జిషీట్‌కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(I.O) ఎవరైతే ఉన్నారో వారు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు దానికి సంబంధిన ఛార్జిషీటులో కేసు వివరాలు, విట్నెస్‌ల పేర్లు, అదే విధంగా కేసుకు సంబంధించి ఎక్కడ జరిగింది, ఏ కోణంలో జరిగిందో వీలైతే ఒక స్కెచ్ గానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలు గానీ సేకరిస్తారు. ఈ ఛార్జిషీట్‌లో ఇలా సేకరించిన తర్వాత ఎవరైతే విట్నెస్‌లు ఉన్నారో వారి వద్ద నుండి స్టేట్‌మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈ నేరం జరిగింది అనే వివరాలు సేకరించి ఈ ఛార్జిషీట్లో పొందు పరుస్తారు.
ఛార్జిషీట్‌కు నిర్థిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు కానీ, సుమారుగా 90 రోజుల్లో ఛార్జిషీట్ చేయాలని కాల వ్యవధి ఉంటుంది. ఛార్జిషీట్ ఫైల్ అయిన తర్వాత ఇక కేసు మూతపడినట్టు కాదు. కావాలంటే అడిషనల్ ఛార్జిషీట్ కూడా ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీసర్ వేసే అవకాశం ఉంటుంది. ఛార్జీషీట్ ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీసర్ తనంతట తాను తయారు చేసే అవకాశం ఉండదు. కేసు నమోదు అయిన తర్వాత విచారణలో నిజనిజాలు తేలిన తర్వాత ఛార్జిషీట్ తయారు అవుతుంది. ఈ ఛార్జిషీట్‌ను చాలా క్లియర్‌గా ఫైల్ చేయాలి. ఛార్జిషీట్‌లో ఉన్న కాలమ్స్‌ను వాటికి సంబంధించిన సరైన వివరాలతో నింపాల్సి ఉంటుంది.
వీటిని ఎప్పుడైనా సీపీ లేదా ఎస్పీ స్టేషన్ తనిఖీకి వచ్చినప్పుడు పరిశీలిస్తారు. ఛార్జిషీట్ సరిగ్గా ఫైల్ చేశారా లేదా ఏదైనా తప్పిదాలు జరిగాయో వాటిని తనిఖీ చేస్తారు. చార్జిషీట్ విషయంలో ఏవైన అవకతవకలు జరిగితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పై తగిన చర్యలు తీసుకుంటారు. అందుకే ఛార్జిషీట్ విషయంలో అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.