Homemain slidesబెంగాల్ లో మరో పెన్ డ్రైవ్ దుమారం

బెంగాల్ లో మరో పెన్ డ్రైవ్ దుమారం

భారత్ సమాచార్, జాతీయం ;

ఇటీవల కర్ణాటకలో ఎన్డీఎ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దాడులు చేసినట్టు ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్ దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీంతో ప్రజ్వల్ దేశం వదలి జర్మనీకి పారిపోయారు. ఈ సంఘటన మరిచిపోక ముందే పశ్చిమ బెంగాల్ మరో పెన్ డ్రైవ్ వివాదం చెలరేగింది.

బెంగాల్‌ గవర్నర్‌ ఆనందబోస్‌కు సీఎం మమత బెనర్జీ షాక్ ఇచ్చే కామెంట్స్ చేశారు. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఫుల్‌ వీడియోల పెన్‌డ్రైవ్‌ తన దగ్గర ఉందని దీదీ తాజాగా చెప్పారు. ఇటీవల గవర్నర్ విడుదల చేసిన వీడియో ఎడిటెడ్ అని ఆరోపించారు. దీంతో బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్‌.. ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 100 మంది పౌరులకు చూపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ వీడియోలు ఎడిటెడ్‌ అని ఆరోపించారు. గవర్నర్‌ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ ప్రవర్తన చాలా దారుణంగా ఉందన్నారు. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారని , కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదని విమర్శించారు.

మహిళలపై వేధింపులకు పాల్పడిన గవర్నర్‌ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలన్నారు. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం సీఎం మమత రాజ్‌భవన్‌కు వెళ్లనని చెప్పారు.

గత నెల 24వ తేదీన, ఈనెల 2వ తేదీన గవర్నర్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయమై తనను గవర్నర్‌ రెండుసార్లు పిలిపించారని, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు. అయితే వీటిని గవర్నర్ కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే నాటి సీసీటీవీ దృశ్యాలను గవర్నర్‌ సాధారణ పౌరులకు కూడా చూపించారు. అయితే, దీనిపై బాధితురాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన ముఖాన్ని బ్లర్‌ చేయకుండా వాటిని బయటపెట్టడం చాలా దారుణమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

RELATED ARTICLES

Most Popular

Recent Comments