భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలను తాజాగా అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in , cbseresults.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 87.98 శాతం విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 0.65 శాతం పెరిగిందని తెలిపారు.