Homebreaking updates newsడెంగ్యూ వ్యాధి కట్టడికి మరో టీకా...

డెంగ్యూ వ్యాధి కట్టడికి మరో టీకా…

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ కట్టడికి మరో కొత్త టీకా అందుబాటులోకి వచ్చిందని ఐక్యరాజ్యసమితి (UNO) తాజాగా ప్రకటించింది. UNO అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఈ టీకాకు ఆమోదం తెలిపింది. డెంగ్యూ వ్యాధి కారణంగా నమోదైన మరణాలలో పదేళ్లే లోపు చిన్నారులే అత్యధికంగా ఉండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం.

ఈ కొత్త టీకా అందుబాటులోకి వస్తే పేద దేశాల్లో చిన్నారుల మరణాలను తగ్గించవచ్చని WHO ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి కట్టడికి ఒక టీకా మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు WHO రెండో టీకా కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO సూచించింది.

మరికొన్ని విశేషాలు…

పీల్చే గాలి… తాగే నీరు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments