Homemain slidesతెలుగు నటులు...కన్నడ పోలీసులు...ఓ రేవ్ పార్టీ

తెలుగు నటులు…కన్నడ పోలీసులు…ఓ రేవ్ పార్టీ

భారత్ సమాచార్, బెంగళూరు ;

రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి అయిపోయిన తర్వాత ప్రస్తుతం చర్చ అంతా ఈ రేవ్ పార్టీ గురించే సాగుతోంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై కర్ణాటక పోలీసుల దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో 25 మందికిపైగా యువతులు ఉన్నట్టు తెలుస్తోంది. బెంజ్ కారులో ఆంధ్రాకు చెందిన ఓ ఎమ్మెల్యే పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

పట్టుబడ్డ వారందరికి బెంగళూరు పోలీసులు మెడికల్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం రేవ్ పార్టీ వెనక కీలక సూత్రధారులు ఎవరన్నదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇందులో హైలెట్ ఏటంటే ఈ రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్ కూడా పాల్గొన్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన నటి హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు తెలిపింది. అంతటితో ఆగకుండా ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్ గా బెంగళూరు పోలసులు ఆ వీడియో కూడా బెంగళూరులో ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్టు తెలిపారు. ఈ వివాదం ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంది. తర్వాత రోజు హైదరాబాద్ బిర్యాని చేస్తూ హేమ ఇంకో వీడియో ని కూడా రిలీజ్ చేసింది. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించాల్సి ఉంది. మరోవైపు హీరో శ్రీకాంత్ కూడా దీనిపై స్పందించారు. తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని తెలిపారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్టు చెప్పారు. తను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు.

అయితే ఇందులో ప్రముఖ రాజకీయ నాయకుల సమీప బంధువులు, బడా వ్యాపారవేత్తల సన్నిహితులు, మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో కావాలనే కొందరు కేసును తప్పు దోవ పట్టించటానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. లేదు ఈ రేవ్ పార్టీ నిర్వాహకుల్ని, అందులో పాల్గొన్న వాళ్లని కూడా వదలిపెట్టం అని పోలీసులు కూడా గట్టిగానే చెబుతున్నారు. మరి అంతిమంగా కేసు ఏ కంచికి చేరుతుందో చూడాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మ్యాక్స్ టన్ హాల్ సిరీస్..చూస్తే మతి పోవాల్సిందే

RELATED ARTICLES

Most Popular

Recent Comments