Homebreaking updates newsజూన్ నుంచి అక్కడ గూగుల్ పే సేవలు బంద్

జూన్ నుంచి అక్కడ గూగుల్ పే సేవలు బంద్

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

ప్రముఖ పేమెంట్స్ సంస్థ గూగుల్ పే తమ సర్వీసుల్ని జూన్ 4వ తేదీ నుంచి అమెరికాలో నిలిపి వేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతానికి గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకటించిన నిబంధనల ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని వెల్లడించింది. అందువల్ల ఇకమీదట గూగుల్ పే సేవలు అమెరికాలో బంద్ కానున్నాయి.

గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని టెకీలు భావిస్తున్నారు. మరికొందరు గూగుల్ మోనోపోలికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే విధంగా, ఇష్టం లేకుండా, కొన్ని చోట్ల సరిగ్గా అనుమతులు కూడా తీసుకోకుండా గూగుల్ పే తమ సేవల్ని నిలిపేసి, గూగుల్ వాలెట్ కు వినియోగదారుల డేటాను బదిలీ చేస్తుందని చెబుతున్నారు. సమీప భవిష్యత్ లో గూగుల్ ఇదే విధానాన్ని భారత్, సింగపూర్ లో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు టెకీలు విశ్లేషిస్తున్నారు.

మరికొన్ని విశేషాలు…

కేపీ.2 కరోనా కొత్త రకం వేరియంట్

RELATED ARTICLES

Most Popular

Recent Comments