భారత్ సమాచార్, తెలంగాణ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పర్వం ముగిసింది. మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీని తరువాత సర్పంచ్ ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ మోజార్టీతో గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఇంకా సర్పపంచ్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీనే సత్తా చాటుతుంది అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్టు, నిరుద్యోగులకు ఎంతో సుపరిచితుడు పాలకూరి అశోక్ సార్ నామినేషన్ వేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కి భయం పట్టుకుంది. అశోక్ సార్ నామినేషన్ వేయనంత వరకు తన గెలుపు ఖాయం అనుకున్నాడు తీన్మార్ మల్లి. కానీ అశోక్ సార్ నామినేషన్ అనంతరం ఒక్కింత భయానికి గురి అవుతున్నాడు. మళ్లీ తాను ఓడిపోతాననే భయం తనను వెంటాడుతుంది. నిరుద్యోగుల నుంచి ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ప్రధాన పార్టీల నాయకులతో పాటు చింతపండుకి కూడా భయం పట్టుకుంది.
ఎంత భయం అంటే ఓ ఛానల్ ఇద్దరినీ ఇంటర్వ్యూకి పిలిస్తే అశోక్ సార్ వస్తే తాను ఇంటర్వ్యూకి రాను అని తెగేసి చెప్పాడు అంటా ఈ చింతపండు నవీన్. ఇలా ఎందుకు చెప్పాడంటే తనకు నిరుద్యోగుల సమస్యలు అంటే ఏంటో తెలియదు. అసలు గ్రూప్ వన్‌లో, గ్రూప్ 2లో ఏం పోస్టులు ఉంటాయో తెలియదు. ఏ జాబుకి ఏం క్వాలిఫికేషన్ కావాలి. ఎలాంటి పరీక్షలు ఉంటాయే తెలియదు. నిరుద్యోగులు నోటిఫికేన్లు రాక..వచ్చినా సరైన సమయంలో పరీక్షలు జరగక ఎంతో ఇబ్బంది పడ్డారు..పడ్డుతున్నారు కూడా. అవి ఏమీ ఈ చింతపండుకి తెలియవు. అసలు ఎప్పుడైనా నిరుద్యోగుల గురించి ప్రశ్నించే గొంతుక ఏ రోజు మాట్లాడిన పాపాన పోలేదు. ఇంకా అశోక్ సార్ కి వీటి అన్నింటిపై పట్టు ఉంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడిండు. వాళ్ల పక్షాన నిలిచిండు. సో డిబెట్ పెడితే నిరుద్యోగల గురించి అశోక్ సార్ తో మాట్లడలేడు. పరువుపోతుందని ముందుగానే గ్రహించి ఇంటర్వ్యూకి రాను అని చెప్పిండు.
అసలు తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలి..?
ప్రశ్నించే గొంతుక అని తనకు తానే ఒక ట్యాగ్ తగిలించుకుండు. ఆయన ఎవరి కోసం ప్రశ్నించిండో.. ఎంత మందని బ్లాక్ మెయిల్ చేసిండో అందరికి తెలుసు. ముఖ్యంగా ఈయనకి పట్టభద్రుల సమస్యలు.. నిరుద్యోగుల అరిగోసలు అసలు ఏం తెలియవు. గత ప్రభుత్వం హాయాంలో నిరుద్యుగులు నోటిపికేషన్లు రాక..వచ్చినా పరీక్షల వాయిదాలు.. పేపర్ లీకేజీలు. ఇలా చాల జరిగాయి. కానీ ఏ రోజు అయినా నిరుద్యోగలు పక్షాన బయటికి వచ్చి మాట్లాడలేదు. పోరాడం చేయలేదు. ఏం జరిగినా ఒక్క కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీని మాత్రమే విమర్శించేవాడు తప్ప ఏ రోజు కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రశ్నించే గొంతుక మాట్లాడలేదు. మరి అలాండప్పుడు ఈ చింతపండుకి ఎందుకు ఓటు వేయాలి. నిరుద్యోగుల కోసం ఏం చేశాడని ఓట్లు వేసి గెలిపించాలి. అసలు నిరుద్యోగుల సమస్యలే తెలియని తెలివి తక్కువ దద్దమ్మకి ఎందుకు ఓటు వేయాలి. అందుకే నిరుద్యోగులారా మేల్కొండి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తిని, తన స్వంత ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతుకను బొంద పెట్టండి. నిజంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేసే వ్యక్తికి ఓటు వేయండి.
అశోక్ సార్‌ని గెలిపించుకుందాం
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్టు, నిరుద్యోగులకు ఎంతో సుపరిచితుడు, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన సౌమ్యుడు మన పాలకూరి అశోక్ సార్.
తెలంగాణ అస్థిత్వాన్ని పునికిపుచ్చుకున్న ధీరత్వం
పాఠాలు చెప్పడమే కాదు పోరాటం నేర్పిన అధ్యాపకుడు
నిరుద్యోగుల బాధలను దగ్గరుండి చూసిన పాత్రికేయుడు
నిరుద్యోగ సమస్యలపై తెగించి కొట్లాడిన నాయకుడు
ఉపాధి కల్పనకై నిత్యం పరిశోధించిన సేవకుడు.
పల్లె నుంచి పట్నం దాకా
కోచింగ్ నుంచి టీచింగ్ దాకా
పైస పైస కూడబెట్టుకున్న నిరుద్యోగులకు
కొలువులకు సిద్దమయ్యే యువతకు
ప్రభుత్వ కొలువు మర్మం విప్పి చెప్పిన నిత్యచైతన్యశీలి
ప్రజాచైతన్యమే సమస్యలకు పరిష్కారమని చెప్పిన ధీశాలి.
విద్యార్థుల తల్లిదండ్రుల తండ్లాట
కొట్టుముట్టాడుతున్న నిరుద్యోగ కొట్లాట
ఇంకెన్నాళ్లని నిలదీసిన ప్రశ్నించే గొంతుక
నిత్య చైతన్య దీపిక.. మన ‘పాలకూర అశోక్’ సార్
పట్టభద్రుల ఎన్నికల్లో అందరం ఏకమవుదాం
అశోక్ సార్‌కు అండగా ఉందాం.
నిరుద్యోగుల పక్షాన నిలిచిన మన అశోక్ సార్‌ని గెలిపించుకుందాం. నిస్వర్థంగా ప్రశ్నించే గొంతుకు అండగా నిలుద్దాం.
మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి