భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ;
వర్షం కురిసి నిలిచిపోయిన ఓ రాత్రి కూరగాయలు అన్ని ఇలా ముచ్చట్లు పెట్టుకున్నాయి…
😏గోంగూరకి ఆహం ఎక్కువ,
ఎందుకంటే తాను గుంటూరు వాసినని…
🥰తోటకూరకి వయ్యారం ఏక్కువ,
ఏందుకంటే నవనవ లాడతానని …
😏పొట్లకాయకి పొగరు ఎక్కువ,
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని…
😲చిక్కుడుకు చికాకు ఎక్కువ,
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని…
😏కందకి..వెటకారం ఎక్కువ,
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని…
😏చేమకు చిమచిమలు ఏక్కువ,
ఏందుకంటే కూర – పులుసు – fri గా ఉపయోగ పడతానని …
😄పేండలానికి పేంకితనo ఏక్కువ,
కత్తిపీటతో తరూగూతారని …
🤗మునగకాయకి మురిపం ఏక్కువ,
మగవారికి దివ్య ఔషధం అని …
😏వంకాయకి గర్వమెక్కువ,
కూరగాయలన్నింటికీ తనే రారాజునని….
😊అరటికాయకి అభిమానం ఏక్కువ,
శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంకమాంసం అంటారని…
🤗బెండకాయకి ఆనందమెక్కువ,
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని….
🤔దొండకాయకి ఆందోళనెక్కువ,
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని….
😊కాకరకాయకి శాంతమెక్కువ,
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా….
🤗బంగాళాదుంపకి సహనమెక్కువ,
కూరలకైనా,చిరుతిండ్లకైనా,పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి….
😏గుమ్మడికాయకి గాంభీర్యమెక్కువ,
కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవని…
😄ఆనపకాయకి ఆనందం ఏక్కువ ,
యేలాగయినా అన్నిరకాలుగా తనని తింటారని …
💃ఉల్లిపాయకి టెక్కు ఎక్కున,
తానులేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని….
😠మిర్చికి కోపమెక్కువ,
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది….
😏కరివేపాకుకి మిడిసిపాటు ఎక్కువ,
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని….
😔బీరకాయకి దిగులెక్కువ,
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని….
😎కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ,
తమంతటి రంగు ఎవరికీ లేదని…
😊ఆఖరిగా పనస పోట్టుకి పరువం ఏక్కువ,
(గ్లామరు హీరోయిను టైపు) ఏలాంటి వాళ్లనైనా సంత్రుప్తి పరుస్తానని…
ఇట్లు…
👏😊👏😊👏
మీ శాఖాహారాభిలాషి…
(వాట్సాఫ్ యూనివర్సిటీ నుంచి సేకరణ)