భారత్ సమాచార్, కడప ;
తల్లి దండ్రులు లేని మరియు తల్లిదండ్రులు చదివించలేని నిరుపేద చిన్నారులకు కడపలోని ప్రముఖ విద్యా సంస్థ ఎటువంటి రుసుములు లేకుండా ఉచిత విద్యను అందిస్తోంది. Kadapa JSOS Organization సంస్థ అనాథ పిల్లలకు 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో, అన్ని వసతులతో, ఉన్నత విలువలతో ఇక్కడ ఉచిత విద్యను అందిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సంస్థలో LKG నుండి PG వరకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అందుబాటులో ఉంది. ఇక్కడ హాస్టల్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ, బిల్డింగ్ ఫీజు కానీ చెల్లించనవసరం లేదని నిర్వహకులు వెల్లడించారు. అర్హత కలిగిన నిరుపేద విద్యార్థులు, అనాథలు మరిన్ని వివరాలకు నిర్వాహకుల మొబైల్ నంబర్స్ *8074223457, *6304076226,*7799009946 లకు సంప్రదించాలని వారు సూచించారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.