భారత్ సమాచార్, హైదరాబాద్ ;
భారత ప్రభుత్వ సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుల ఆన్లైన్ శిక్షణ కోసం నేషనల్ స్కిల్ అకాడమీ భారతదేశం అంతటా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ మరియు PG వంటి అర్హతలు కలిగిన వ్యక్తులకు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సులు….
దరఖాస్తుదారులు నేషనల్ స్కిల్ అకాడమీ అఫియల్ వెబ్ సైట్ లో ఉన్న 50కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో DevOps, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, SaaS, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, VB, GST, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు వెబ్ డిజైన్ కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
కోర్సు వివరాలు మరియు సర్టిఫికేషన్…
ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులు ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.
ఆర్థిక సహాయం…
ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి, దారిద్య రేఖ (రేషన్ కార్డు దారులు) దిగువన ఉన్నవారికి ఫీజులో రాయితీ లభిస్తుంది. SC, ST, BC, EBC, OBC, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (PH), మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.inలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేయటానికి జూన్ 6న చివరి తేదీ. మరిన్ని వివరాలకు మొబైల్ నబంర్ 9505800050 ను సంప్రదించవచ్చు.