Homebreaking updates newsజూన్ 1 నుంచి కొత్త రూల్స్... అలర్ట్ అవ్వాల్సిందే

జూన్ 1 నుంచి కొత్త రూల్స్… అలర్ట్ అవ్వాల్సిందే

భారత్ సమాచార్, అమరావతి ;

భారత్ లో జూన్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉంది. దశాబ్దాలుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసర్ దగ్గరకు వెళ్తున్నాం. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మీరు కచ్చితంగా ఆర్టీవో ఆఫీసర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలను జారీ చేసింది. ఒక వేళ మైనర్ వాహనం నడిపితే రూ.25 వేలు ఫైన్, 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం అమలు చేయనున్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానతో పాటుగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనం నడిపితే కనీసం రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. జూన్ 1వ తేదీ నుంచే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు జూన్ 14 వరకే గడువు ఉంటుంది.

మరికొన్ని తాజా విశేషాలు…

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments