భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: ఇటీవల చిన్నారులు చిన్నచిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకుంది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని పదేళ్ల బాలుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కటింగ్ నచ్చినట్లు చేయలేదని:
గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావు అనే రైతుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (10) సీతానాగారం లోని హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగిన బాలున్ని తండ్రి సముదాయించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పొలం పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగులమందు సేవించాడు. బాలుడిని గమంచిన తల్లిదండ్రులు చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరన్ని కథనాలు: