భారత్ సమాచార్, హైదరాబాద్: అక్షర యోధుడు, వ్యాపార కుబేరుడు రామోజీరావు అస్తమించారు. ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాల్లో ‘ఈనాడు’ ఒకటి. ఈ సంస్థ అంటే ఆయకు ఎంతో ప్రాణం. ఎక్కడో విశాఖపట్నంలో ప్రారంభమైన ‘ఈనాడు’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో సత్తా చాటడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను శాసిస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోసిస్తోంది. అంతటి సంస్థగా తీర్చిదిద్దడం వెనక రామోజీరావు ఎంతో కఠోర శ్రమ, నిబద్ధత దాగి ఉంది. ఈ మార్గంలో ఆయనకు తోడుగా నిలిచినవారు ఎందరో ఉన్నారు. వారిలో ఆయన స్నేహితుడు రామ్మోహన్ రావు ఒకరు. టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ‘ఈనాడు’ అప్పగించారు. రామ్మోహన్ రావు ఈనాడు కోసం చాలా కష్టపడ్డారని, ఈనాడు ఈ స్థాయిలో ఉండటానికి ఆయన ప్రధాన భూమిక పోషించారని. రామోజీరావు చాల సందర్భాల్లో చెప్పారు.
అయితే ‘ఈనాడు’ మహావృక్షం లాంటిది. ఈ సంస్థకు ప్రస్తుతం వారసలు ఎవరంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. రామోజీరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారు సుమన్, చిన్న కుమారుడు కిరణ్. సుమన్ అనారోగ్యంతో కొన్నాళ్ల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రామోజీరావు తాను జీవించి ఉన్న సమయంలోనే సంస్థలను అందరికీ అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయా సంస్థలను వారే నడుపుతున్నారు కూడా.
రామోజీ రావు వారసులు ఎవరంటే?
కరోనా తరువాత అన్నదాతలకు ఎంతో అండగా నిలిచిన అన్నదాత పిల్లలకు వినోదాన్ని, మేధా శక్తిని పంచే బాల భారతం. ఇంకా విపుల, చతుర, తెలుగు వెలుగు లాంటివన్నీ మూసేశారు. పెద్ద కుమారుడు కిరణ్కు ‘ఈనాడు’ బాధ్యతలను అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి సంస్థను ఆయనే నడిపిస్తున్నారు. పెద్ద కోడలు శైలజాకిరణ్ కు మార్గదర్శి చిట్ ఫండ్, కళాంజలి, చిన కోడలు విజయేశ్వరికి రామోజీ ఫిలింసిటీ, మనవరాలు బృహతికి ఈటీవీ భారత్, ఇతర సంస్థల బాధ్యతలను చినకొడుకు సుమన్ కుమారుడు, కిరణ్ కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రామోజీ రావు ఆస్తులు ఎన్నంటే?
హైదరాబాద్ లో దాదాపు 2వేల ఎకరాల విస్తీర్ణంలో రామోజీ ఫిలిం సిటీ ఉంది. దీని విలువ 20 వేల కోట్ల రూపాయలని అంచనా. 2021 నాటికి రామోజీరావు మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 4.5 బిలియన్ డాలర్లు అంటే 37,583 కోట్లు అని తెలుస్తోంది.
రామోజీరావు మాత్రం తన చివరి శ్వాస వరకు ‘ఈనాడు’ కోసమే పనిచేశారు. పత్రిక ప్రతిరోజు చదువుతూ ఎడిటోరియల్ సిబ్బందికి సూచనలిచ్చేవారు. వారసుల చేతిలో రామోజీ గ్రూపు సంస్థలు మరింతగా వృద్ధి చెందాలని అందరూ కోరుకుంటున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన రామోజీరావు ఎప్పటికి ప్రజల గుండెల్లో ఉంటారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి