Homebreaking updates newsత్రివేణి సంగమంలో స్నానం చేస్తుండగా..

త్రివేణి సంగమంలో స్నానం చేస్తుండగా..

భారత్ సమాచార్.నెట్, జయశంకర్‌భూపాలపల్లి: పుణ్యస్నానానికి వచ్చి కాళేశ్వరం త్రివేణి సంగమంలో యువకుడు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. తల్లిదండ్రులతో కలిసి పుణ్యస్థనానికి వచ్చిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోగా కన్నవారు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర త్రివేణి సంగమం గోదావరి నదిలో జరిగింది.

పుణ్యస్నానం చేస్తుండగా గల్లంతు:
వరంగల్ నగరంలోని లేబర్ కాలనీకి చెందిన గరికపాటి ప్రవీణ్, రజిని దంపతుల కుమారుడు అఖిల్ కుటుంబసభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే గోదావరిలో పుణ్యస్థానాలు చేస్తుండగా అఖిల్ గల్లంతయ్యాడు. తన కొడుకు గోదావరిలో మునిగిపోతుండగా చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు స్థానికులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న జాలర్లు వెంటనే రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అఖిల్ ను ప్రాణాలతో కాపాడలేకపోయారు. ఆదివారం జరిగిన ఘటనలో సోమవారం ఉదయం అఖిల్ మృతదేహం లభ్యమైంది. పుణ్య స్నానానికి వచ్చి విగత జీవిగా మారిన కన్న బిడ్డను ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చేతికందిన కొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని కథనాలు:

ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments